
అనూప్ రూబెన్స్ బర్త్ డే: హిట్ ఆల్బమ్స్ ఇచ్చినా స్టార్ స్టేటస్ కు ఆమడ దూరంలో నిలిచిన అనూప్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగులో స్టార్ స్టేటస్ సంగీత దర్శకులను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. తెలుగు సినిమా స్థాయి ఇంతలా పెరిగిన తర్వాత కూడా సంగీతం అనగానే వేరే భాషల టెక్నీషియన్ల వైపు మొగ్గు చూపుతుంటారు.
అయితే తెలుగు సినిమా సంగీత చరిత్రలో తనకంటూ స్థానం సంపాదించుకున్నాడు అనూప్ రూబెన్స్. ఈరోజు అనూప్ పుట్టినరోజు. 44వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న అనూప్ సినిమా జర్నీ గురించి మాట్లాడుకుందాం.
అనూప్ అసలు పేరు ఈనోక్ రూబెన్స్. సంగీతంపై ఆసక్తి పెంచుకున్న అనూప్, చర్చి కార్యక్రమాల్లో పాడుతూ ఉండేవాడు. అలా నెమ్మదిగా సినిమాల వైపు మళ్ళాడు.
సినిమా కెరీర్:
మొదటగా దర్శకుడు తేజ, జై చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ధైర్యం సినిమాలో అవకాశం కల్పించారు.
Detais
మనంతో మారిన కెరీర్
జై, ధైర్యం చిత్రాల పాటలు హిట్ అవడంతో, అనూప్ కు అవకాశాలు పెరిగాయి. ఇష్క్ చిత్రంతో అనూప్ పేరు మారుమోగిపోయింది. ఇష్క్ సినిమా హిట్ కావడంలో పాటలకు అధిక ప్రాధాన్యం ఉందని అందరికీ తెలుసు.
ఆ తర్వాత లవ్లీ, గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలు చేసాడు అనూప్. ఇక అనూప్ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా మనం.
అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు కనిపించిన సినిమా ఇది. ఇందులోని పాటలు ఇప్పటికీ తమ ప్లే లిస్ట్ లో పెట్టుకుంటారంటే మనం సినిమా సంగీతం ఎంతపెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు.
మనం సినిమా వల్ల అనూప్ చేతికి పెద్ద సినిమాలు వచ్చాయి. పైసా వసూల్, టెంపర్, గోపాల గోపాల చిత్రాలను సంగీతం అందించాడు.
Details
70సినిమాలకు సంగీతం అందించిన అనూప్
పెద్ద హీరోల సినిమాలకు పనిచేసినా కూడా అనూప్ కు స్టార్ స్టేటస్ రాలేదు. ఈ మధ్య కాలంలో అయితే స్టార్ హీరోల సినిమాలకు సంగీతం చేసే అవకాశం రాలేదు.
తన కెరీర్ లో ఇప్పటివరకు 70కి పైగా సినిమాలకు సంగీతం అందించాడు కెరీర్. ప్రస్తుతం ఓటీటీ సిరీస్ లకు కూడా మ్యూజిక్ చేస్తున్నాడు.
తాజాగా కథలు అనే సిరీస్ కు పాటలు అందించాడు. తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అనూప్, తెలుగులో స్టార్ స్టేటస్ ఎప్పుడు అందుకుంటాడో చూడాలి.