
Rituraj Singh: ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టీవీ నటుడు రితురాజ్ సింగ్(59)మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు.
అయన సహచరుడు అమిత్ బెహ్ల్ ఈ వార్తను మీడియా కి తెలియజేశాడు. రితురాజ్ ప్యాంక్రియాస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని CINTAA చీఫ్ తెలియజేశారు.
రీతురాజ్ కె సింగ్ ఇటీవల రూపాలీ గంగూలీ టీవీ సీరియల్ 'అనుపమ'లో యశ్‌పాల్ పాత్రలో కనిపించారు.ఈ నటుడు టీవీ,చలనచిత్ర పరిశ్రమ రెండింటిలోనూ గొప్ప కెరీర్ ను కొనసాగించాడు.
సింగ్ 'బనేగీ అప్నీ బాత్'తో సహా పలు ప్రముఖ టెలివిజన్ ధారావాహికలలో నటించారు.అంతే కాకుండా, రీతురాజ్'యే రిష్తా క్యా కెహ్లతా హై','త్రిదేవియన్','దియా ఔర్ బాతీ హమ్',అనేక ఇతర టీవీ సీరియల్స్ లలో కూడా కనిపించారు.
అతను వరుణ్ ధావన్,అలియా భట్‌లతో కలిసి'హంప్టీ శర్మ కీ దుల్హనియా'చిత్రంలో కూడా కనిపించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గుండెపోటుతో మరణించిన రితురాజ్ సింగ్
Om Shanti 🙏🏻#riturajsingh pic.twitter.com/G3Csz0zh8b
— RVCJ Movies (@rvcjmovies) February 20, 2024