LOADING...
Anupama Parameswaran: అనుపమ తగ్గేదేలే.. 2025లో ఏడో సినిమా విడుదలకు సిద్ధం! ఈసారి థ్రిల్లర్ 
ఈసారి థ్రిల్లర్

Anupama Parameswaran: అనుపమ తగ్గేదేలే.. 2025లో ఏడో సినిమా విడుదలకు సిద్ధం! ఈసారి థ్రిల్లర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ మామూలు బిజీగా లేదు.ఆమె నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. 2025లో ఆమె నటించిన ఏడో చిత్రం కూడా రిలీజ్‌కు లైన్‌లో నిలిచింది. తాజాగా ఆమె కొత్త సినిమా 'లాక్‌డౌన్‌' విడుదల తేదీని చిత్ర బృందం నవంబర్ 19న అధికారికంగా ప్రకటించింది. అనుపమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాక్‌డౌన్‌ షూటింగ్ గత ఏడాది ప్రారంభమైనా, వాయిదాలు ఎదురై విడుదల ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్‌లో థియేటర్లకు తీసుకురావాలనుకున్నారు కానీ సాధ్యం కాలేదు. చివరికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 5, 2025. దీనికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం రిలీజ్ చేశారు.

వివరాలు 

అదే రోజున బాలయ్య బాబుతో క్లాష్

డిసెంబర్ 5న లాక్‌డౌన్‌ థియేటర్లలోకి వస్తుండగా, అదే రోజున భారీ హైప్ ఉన్న 'అఖండ 2' కూడా రిలీజ్ అవుతోంది. బాలయ్య బాబు చిత్రం కాంపిటిషన్ ఉన్న నేపథ్యంలో, లాక్‌డౌన్‌ తెలుగు మార్కెట్లో ఎంతవరకు దూసుకెళ్తుందో చూడాలి. ఈ చిత్రం అసలు తమిళం; అక్కడ కూడా కార్తీ హీరోగా వస్తున్న 'వా వాతియార్' తో పోటీ పడనుంది. లాక్‌డౌన్‌కు దర్శకత్వం వహించిన ఏఆర్ జీవాకు ఇది తొలి చిత్రం. ఈ సినిమాలో అనుపమతో పాటు ఛార్లీ, నిరోష, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, ఇందుమతి, రాజ్‌కుమార్ వంటి నటులు కనిపించనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా సమయంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను నేపథ్యంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రం పూర్తి థ్రిల్లర్‌గా రూపొందింది.

వివరాలు 

2025లో అనుపమ దూకుడు

ఈ ఏడాది అనుపమ అన్ని భాషల్లోనూ వరుస సినిమాలతో రచ్చ చేస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకువచ్చాయి. డ్రాగన్, పరదా, కిష్కింధపురి, జేఎస్కే జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్, బైసన్. వీటిలో డ్రాగన్‌, బైసన్‌ తమిళ చిత్రాలు. జేఎస్కే జానకి వి.. ది పెట్ డిటెక్టివ్ మలయాళ మూవీస్. పరదా, కిష్కింధపురి మాత్రం తెలుగులో ఆమె చేసిన సినిమాలు. ఇప్పుడు మరో తమిళ థ్రిల్లర్ లాక్‌డౌన్‌ తో ఆమె ఏడో సినిమాను విడుదలకు సిద్ధం చేస్తోంది.