LOADING...
Lockdown Trailer: అనుపమ పరమేశ్వరన్ కొత్త ప్రయోగం.. 'లాక్‌డౌన్' ట్రైలర్ రిలీజ్!

Lockdown Trailer: అనుపమ పరమేశ్వరన్ కొత్త ప్రయోగం.. 'లాక్‌డౌన్' ట్రైలర్ రిలీజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2025
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సుందరి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ 'లాక్‌డౌన్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ.ఆర్. జీవా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI)లో ప్రదర్శింపబడి మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు థియేటర్ల విడుదలకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, 'లాక్‌డౌన్' చిత్రాన్ని డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Details

అనిత' అనే ముఖ్య పాత్రలో అనుపమ పరమేశ్వరన్

ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ను పరిశీలిస్తే—కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన తరువాత ప్రజలు ఎదుర్కొన్న వాస్తవ ఘటనలను ఈ సినిమా ఆధారంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ 'అనిత' అనే ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. భావోద్వేగాలతో పాటు సర్వైవల్ అంశాలను సమ్మిళితం చేసిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement