
Anupama Parameswaran: హీరోయిన్స్‌ను మాత్రమే అలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బందిపెడతారు: అనుపమ పరమేశ్వరన్
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లను పట్టించుకోవడం మానేశానని నటి అనుపమ పరమేశ్వరన్ వెల్లడించారు. ఆమె కథానాయికగా నటించిన, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన 'పరదా' సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమె తన కెరీర్‌కు సంబంధించిన అనుభవాలు, ఆలోచనలను పంచుకున్నారు.
వివరాలు
కెరీర్ ప్రారంభ దశలో ఇలాంటి కామెంట్లు విన్నప్పుడు నిజంగా బాధపడ్డా..
''ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను పెద్దగా పట్టించుకోవడం మానేశాను.'పరదా' పోస్టర్స్ షేర్ చేసినప్పుడు కూడా కొందరు నెగెటివ్ రియాక్షన్లు ఇచ్చారు.'ఇది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది'అంటూ వ్యాఖ్యానించారు. కానీ అలాంటి మాటలతో సినిమా విజయాన్ని నిర్ణయించలేరు. ఒకవేళ నిజంగానే ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందకపోయినా, నేను మంచి సినిమా చేశాననే సంతృప్తి మాత్రం జీవితాంతం నాలో ఉంటుంది.కెరీర్ ప్రారంభ దశలో ఇలాంటి కామెంట్లు విన్నప్పుడు నిజంగా బాధపడ్డాను.కానీ అనుభవం పెరిగిన కొద్దీ ఇవన్నీ చాలా చిన్న విషయాల్లా అనిపిస్తున్నాయి.ఒకప్పుడు ప్రతి పోస్ట్‌కి వచ్చిన కామెంట్లన్నీ చదివేదాన్ని.ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసి వదిలేస్తాను.మనల్ని ఎలాంటి మాటలు అన్నా,మన జీవితం ముందుకు సాగాల్సిందే అని అర్థం చేసుకున్న తర్వాత ఈ విమర్శలు నిరర్థకంగా కనిపిస్తాయి''అన్నారు.
వివరాలు
అలాంటి రోల్స్‌ను చేయడం ఒక సవాలే
''టిల్లు స్క్వేర్ తర్వాత నా మాట్లాడే తీరులో కూడా మార్పు వచ్చింది. ఆ సినిమా రిలీజ్‌కి ముందు నాపై చాలా నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత ప్రశంసలు దక్కాయి. ట్రైలర్ రిలీజ్ సమయంలో నెగెటివిటీ వస్తుందని తెలిసే ఆ పాత్రను చేశాను. అలాంటి రోల్స్‌ను చేయడం ఒక సవాలే. వాటిని అంగీకరించాలంటే నిజంగా ధైర్యం కావాలి. ఆ సినిమా ప్రచారం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో నాకు ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. అలాంటి ప్రశ్నలు మాత్రం ఎప్పుడూ హీరోయిన్స్‌కే వేస్తారు, హీరోలకు అడగరు. ఎందుకంటే అలాంటి ప్రశ్నలతోనే వాళ్లకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. కానీ వాటికి సమాధానాలు ఇవ్వడం చాలా కష్టంగా అనిపించింది'' అని అనుపమ పరమేశ్వరన్ చెప్పారు.