Page Loader
Anushka Shetty: అనుష్క 'ఘాటీ' రిలీజ్ మళ్లీ పోస్ట్‌పోన్.. నిరాశలో ఫ్యాన్స్ !
అనుష్క 'ఘాటీ' రిలీజ్ మళ్లీ పోస్ట్‌పోన్.. నిరాశలో ఫ్యాన్స్ !

Anushka Shetty: అనుష్క 'ఘాటీ' రిలీజ్ మళ్లీ పోస్ట్‌పోన్.. నిరాశలో ఫ్యాన్స్ !

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 02, 2025
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కొత్తదనం తీసుకొచ్చిన హీరోయిన్ అనుష్క శెట్టి, తన తదుపరి చిత్రం 'ఘాటీ' ద్వారా మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతోంది. 'బాహుబలి' వంటి మహత్తర విజయానంతరం చాలా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేస్తున్న అనుష్క, మళ్లీ ఒక సాలిడ్ ఫిమేల్ లీడ్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. గతంలో అనుష్కకు 'వేదం' వంటి హిట్ అందించిన దర్శకుడు కృష్ణ జాగర్లమూడి (క్రిష్) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి.

Details

పెండింగ్ లో విజువల్ ఎఫెక్ట్స్ పనులు

అంతేకాదు, ఈ సినిమాను 2024 ఏప్రిల్ 18న విడుదల చేయాలని మేకర్స్ తొలుత భావించారు. కానీ షూటింగ్ డిలే కావడంతో విడుదల వాయిదా పడింది. అనంతరం మేకర్స్ జూలై 11న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు షూటింగ్ పూర్తి చేయడమే కాక, ప్రమోషన్లకు సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా జూలై 11న థియేటర్లలోకి వస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం, సినిమా సీజీ (విజువల్ ఎఫెక్ట్స్) పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, ఇంకా కొన్ని ముఖ్యమైన సెగ్మెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది.

Details

త్వరలోనే అధికారిక ప్రకటన

అందువల్ల, నిర్ణయించిన తేదీలో విడుదల చేయడం సాధ్యం కాదని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సినిమా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందని, ఈ విషయాన్ని త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో 'ఘాటీ' తదుపరి రిలీజ్ డేట్ ఎప్పుడో అనేది సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. అనుష్క ఫ్యాన్స్ మాత్రం సినిమా మంచి కంటెంట్‌తో వస్తుందని విశ్వసిస్తున్నారు.