
Anushka shetty birthday: అనుష్క జీవితంలో జార్జియా కారు డ్రైవర్ కథ మీకు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
అనుష్క శెట్టి.. దక్షిణాది ఇండస్డ్రీని, బాహుబలితో భారతీయ సినిమా పరిశ్రమను ఒక ఊపు ఊపేసిన హీరోయిన్. మంగళవారం టాలీవుడ్ స్వీటీ అనుష్క పుట్టిన రోజు.
ఈ నేపథ్యంలో అమె గొప్పతనాన్ని తెలియజేసే జార్జియా కారు డ్రైవర్ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తమిళ సినిమా 'వర్ణ' షూటింగ్ కోసం జార్జీయాకు వెళ్లింది. అక్కడ ఆమెకు డ్రైవర్‌గా జాజా అనే వ్యక్తి వ్యవహరించాడు.
కొన్నిరోజుల తర్వాత అనుష్క, జాజా మంచి స్నేహితులు అయ్యారు. ఈ క్రమంలో అతని కుటుంబ వివరాలను కూడా అనుష్క అడిగి తెలుసుకునేది.
ఆ తర్వాత ఒకరోజు పికప్ చేసుకోడానికి జాజా రాలేదు. అతను ఎందుకు రాలేదని అనుష్క వాకబు చేసింది. లోన్‌ను కట్టకపోడంతో కారును కంపెనీ వాళ్లు లాక్కెళ్లిపోయినట్లు తెలిసింది.
స్వీటి
జాజా కుటుంబానికి దేవతలా మారిన అనుష్క
ఆ కారు జాజా కుటుంబానికి జీవనాధారం అని అనుష్కకు తెలుసు. అందుకే అతనికి సమస్యను పరిష్కరించాలని అనుకున్నది.
మేనేజర్ ద్వారా జాజాను పిలిపించింది. అనంతరం జాజాకు కొత్త బెంజ్ కారును గిఫ్ట్‌గా అందించి తన గొప్ప మనసును చాటుకుంది.
జాజాకు చేసిన సాయాన్ని అనుష్క ఎప్పుడూ బయటకు చెప్పుకోలేదు. అనుష్క కెరీర్‌లో గేమ్ ఛేంజర్‌గా చిత్రం అరుంధతి నిర్మించిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
తాను విహారయాత్ర కోసం ఇటీవల జార్జియాకు వెళ్లినప్పుడు, అక్కడ జాజా అనే వ్యక్తిని కలిశానని, అప్పుడు అతను అనుష్క చేసిన సాయం గురించి చెప్పినట్లు శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
అంతేకాదు, అనుష్కను జాజా కుటుంబం ఒక దేవతలా చూస్తోందని వెల్లడించారు.