LOADING...
Anushka Shetty: అనుష్క శెట్టి పెళ్లిపై క్రేజీ న్యూస్..వరుడు ఎవరో తెలుసా?
అనుష్క శెట్టి పెళ్లిపై క్రేజీ న్యూస్..వరుడు ఎవరో తెలుసా?

Anushka Shetty: అనుష్క శెట్టి పెళ్లిపై క్రేజీ న్యూస్..వరుడు ఎవరో తెలుసా?

వ్రాసిన వారు Moogati Shabari
Mar 17, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్ సినీ పరిశ్రమలో 'లేడీ సూపర్ స్టార్'గా ప్రత్యేక గుర్తింపు పొందిన అనుష్క శెట్టి పెళ్లి గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆమె పెళ్లిపై ఎన్నో రూమర్లు వినిపించినా, తాజా సమాచారం ప్రకారం ఆమె త్వరలోనే వివాహం చేసుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం 44 ఏళ్ల వయస్సులో ఉన్న అనుష్క, తన కుటుంబానికి దగ్గరైన బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లి చేసుకోబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వివరాలు

త్వరలోనే పెళ్లి..?

ఇప్పటివరకు అనుష్క, ప్రభాస్‌కు వివాహం జరుగుతుందనే వార్తలు తరచుగా వైరల్ అయ్యేవి. అయితే, వారు కేవలం స్నేహితులే అని ఇద్దరూ పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరల్ అవుతున్న వార్తలు ప్రభాస్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అనుష్క పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కన్నడ కుటుంబానికి చెందినవారని, ఈ సంబంధానికి ఇరు కుటుంబాల పెద్దలు ఇప్పటికే సమ్మతి తెలిపినట్లు సమాచారం. ఇది పూర్తిగా పెద్దల నిర్ణయంతో జరుగుతున్న అరేంజ్డ్ మ్యారేజ్ అని, ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని ఇండస్ట్రీలో చర్చలు జోరందుకున్నాయి.

వివరాలు

ఆ విషయం గోప్యంగా ఉంచుతున్న అనుష్క

ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆమె వివాహం జరగవచ్చని సన్నిహిత వర్గాల సమాచారం. వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడాన్ని ఇష్టపడే అనుష్క, తన పెళ్లి విషయాన్ని కూడా నేరుగా ఆహ్వాన పత్రిక ద్వారా వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆమె సినిమా కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మలయాళంలో రూపొందుతున్న భారీ చిత్రం 'కథనార్'లో నటిస్తున్నారు.

Advertisement