Anushka: అనుష్క పెళ్లి రూమర్స్‌కు చెక్… ప్రచారాలపై టీమ్ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలె నటి అనుష్క శెట్టి వివాహంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరంలో ఆమె ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వేగంగా ప్రచారం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె టీమ్ స్పందిస్తూ ఆ వార్తలపై ఫైర్ అయ్యింది. ఒకరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను రోజువారీ వార్తలుగా మార్చే ముందు, అవి నిజమైనవేనా కాదా అన్నది కనీసం ధృవీకరించడం అవసరం అని తెలిపింది. ఊహాగానాలు చేయడం, అంచనాలు వేయడం, అధికారిక సమాచారం లేకుండా పదే పదే ప్రచారం చేయడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా అనుష్క వయస్సుపై అనవసర దృష్టి పెట్టడం మరింత నిరాశ కలిగిస్తోందని ఫైర్ అయ్యింది.
వివరాలు
అది సరైంది కాదు..అలా చేయకండి..
ప్రతి వార్తలో '44' అనే సంఖ్యను వివాదాస్పద అంశంలా ప్రస్తావించడం ఎందుకని ప్రశ్నించింది. వయస్సు అంత ముఖ్యమైతే, హీరోల వయస్సుపై కూడా అదే విధంగా చర్చ ఎందుకు జరగడం లేదు? మహిళల విషయంలో మాత్రమే ఈ విధమైన తేడా ఎందుకు కనిపిస్తోందని అనుష్క శెట్టి టీమ్ ప్రశ్నించింది. అనుష్క శెట్టి తన ప్రతిభ, కష్టపడి పనిచేసే నైపుణ్యంతో గౌరవప్రదమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు. ఆమె ఎప్పుడూ ప్రచార స్టంట్లపై ఆధారపడలేదని, తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవాలనే నిర్ణయాన్ని గౌరవించాలని టీమ్ సభ్యులు తెలిపారు. అలాంటి వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరైంది కాదని అనుష్క టీమ్ హెచ్చరించింది.