LOADING...
Ghati: ఓటీటీలోకి వచ్చేసిన ఘాటీ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
ఓటీటీలోకి వచ్చేసిన ఘాటీ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Ghati: ఓటీటీలోకి వచ్చేసిన ఘాటీ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు పొందిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, ఇప్పుడు తరచుగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఆమె విక్రమ్ ప్రభుతో జంటగా నటించిన చిత్రం 'ఘాటీ' సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో విడుదల అయింది. ఈ సినిమాను UV క్రియేషన్స్ సమర్పణలో, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ కింద రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. దర్శకత్వ బాధ్యతలు క్రిష్ జాగర్లమూడి నిర్వహించారు. జగపతి బాబు, చైతన్య రావు, రవీంద్ర విజయ్ వంటి ప్రముఖ నటులు కూడా ఘాటీలో కీలక పాత్రల్లో కనిపించారు.

వివరాలు 

సెప్టెంబర్ 26 నుండి అమెజాన్ ప్రైమ్ లో 

ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ గా మిగిలింది.ప్రధానంగా గంజాయి చుట్టూ కథ సాగడం,చివరలో "గంజాయి తాగొద్దు" అనే సందేశంతో ఇవ్వడం లాంటి కథతో మంచి విజువల్స్ ఉన్నా ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కలేదు. ఈ సినిమాతో అనుష్క ఫ్యాన్స్ కూడా నిరుత్సాహపడ్డారు. కొండలు, కోనల వంటి దృశ్యాల్లో షూట్ చేసినప్పటికీ, సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయితే ఘాటీ సినిమా నెల రోజుల ముందే ఓటీటీలోకి వచ్చేయడం గమనార్హం.అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక ప్రకటన ప్రకారం, ఈ చిత్రం సెప్టెంబర్ 26 నుండి ఆ ప్లాట్‌ఫారంలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం 'ఘాటీ' తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. హిందీ వర్షన్ లేకపోవడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెజాన్ ప్రైమ్ చేసిన ట్వీట్