వీరసింహారెడ్డి డైలాగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు??
సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, వీరసింహారెడ్డి సినిమాలోని డైలాగులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగులు డైరెక్టుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని, అందువల్ల ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అనుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ అధికారులు కొందరు వీరసింహారెడ్డి సినిమాను విజయవాడలో చూసారట. అందులోని కొన్ని సన్నివేశాలు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా ఉన్నట్లు భావించారట. ఈ విషయమై సినిమా నిర్మాణ సంస్థను, దర్శకుడిని వివరణ కోరేందుకు ఏపీ ప్రభుత్వ అధికారులు సిద్ధం అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ విషయం మీద మరింత స్పష్టత రావాల్సి ఉంది.
వీరసింహారెడ్డి ట్రైలర్ రిలీజైనపుడు వచ్చిన కామెంట్లు
వీరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్ అయినపుడు కూడా అందులోని డైలాగ్స్ ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ చేసినట్లు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మరి ఈ విషయమై ముందు ముందు ఏం జరగనుందో చూడాలి. ప్రస్తుతానికి వీరసింహారెడ్డి సినిమాకు అభిమానుల నుండి పాజిటివ్ స్పందన వచ్చింది. సాధారణ ప్రేక్షకులు మాత్రం మిశ్రమ స్పందన తెలియజేసారు. వీరసింహారెడ్డి పాత్రలో బాలయ్య బాగా కనిపించాడని, ఆ తర్వాత సెకండాఫ్ మాత్రం నెమ్మదించిందని, యాక్షన్ సీక్వెన్స్, ఫైట్స్, నేపథ్య సంగీతం బాగున్నాయని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను నవీన్ యేర్నేని రవి శంకర్ నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించింది. సంగీతం, థమన్ సమకూర్చగా, గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.