వీరసింహారెడ్డి రివ్యూ: బాలయ్య అభిమానులకు పండగే
బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చేసింది. దాంతో టాక్ బయటకు వచ్చేసింది. మరిఈ సినిమా ఎలా ఉందీ, కథేంటి? ఎలా తీశారు? మొత్తం వివరాలు తెలుసుకుందాం. సినిమా మొదలైన 20నిమిషాలు నెరేషన్ స్లోగా ఉందని టాక్. ఆ తర్వాత వీరసింహారెడ్డి క్యారెక్టర్ ఎంటర్ అవుతుందని, అక్కడి నుండి సినిమాలో వేగం పుంజుకుంటుందని అంటున్నారు. పెద్దిరెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ సీన్ లోని ఫైట్, ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా ఉందట. పవర్ ఫుల్ డైలాగ్స్, థమన్ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్తున్నారు. పాటలు సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అనీ, క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో వరలక్ష్మీ పాత్ర బాగుందని టాక్.
వీరసింహారెడ్డి సినిమాలోని మైనస్ పాయింట్లు
రొటీన్ స్టొరీ కావడమే ఈ సినిమాకు ప్రధాన మైనస్ అని టాక్. ఫస్టాఫ్ వదిలేస్తే సెకండాఫ్ మాత్రం పాత సినిమాలను గుర్తు చేసిందని, ఎమోషన్ ఎక్కువగా ఉందని, కాకపోతే అది కనెక్ట్ కాలేదని అంటున్నారు. కొందరేమో సినిమా నిడివి ఎక్కువగా ఉందని, ఎక్కువ ఫైట్స్ ఉన్నాయని అంటున్నారు. మరికొందరేమో సినిమాను దర్శకుడు సరిగ్గా డీల్ చేయలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సినిమా మొత్తంలో బాలయ్య ప్రధాన ఆకర్షణగా నిలిచాడని, ఒంటిచేత్తో సినిమాను నడిపించాడని, బాలయ్య అభిమానులకు పండగలా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కాకపోతే బాలయ్య అభిమానులు, మాస్ సినిమాలను ఇష్టపడేవారికి పండగలా ఉంటుందని టాక్.