LOADING...
Konda Surekha: నాగార్జునకు క్షమాపణలు.. విచారణకు ముందు సోషల్ మీడియాలో కొండా సురేఖ పోస్టు!
నాగార్జునకు క్షమాపణలు.. విచారణకు ముందు సోషల్ మీడియాలో కొండా సురేఖ పోస్టు!

Konda Surekha: నాగార్జునకు క్షమాపణలు.. విచారణకు ముందు సోషల్ మీడియాలో కొండా సురేఖ పోస్టు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. నాగార్జునకు క్షమాపణలు చెప్పుతూ, అర్ధరాత్రి ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. ఆయన కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. నాగార్జున కుటుంబం బాధపడితే చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ స్పష్టం చేశారు.

Details

రేపు నాంపల్లి కోర్టులో విచారణ

ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నాంపల్లి ప్రత్యేక కోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో, విచారణకు ఒక్క రోజు ముందు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు ప్రకటించడం గమనార్హం.