Loading...
Samantha: డ్రెస్‌లు సరిపోవడం లేదట.. రెండు జతలతో హాలీడేకు సమంత!
డ్రెస్‌లు సరిపోవడం లేదట.. రెండు జతలతో హాలీడేకు సమంత!

Samantha: డ్రెస్‌లు సరిపోవడం లేదట.. రెండు జతలతో హాలీడేకు సమంత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

నటి సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె.. తాజాగా ఓ క్యూట్‌ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన సరదా అనుభవాన్ని క్యాప్షన్‌ రూపంలో తెలిపారు. 'నా దగ్గర చాలా డ్రెస్‌లు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవేవీ నాకు సరిపోవడం లేదు. ఈ విషయం తెలిసి నాకు 'మినీ బ్రేక్‌డౌన్‌' వచ్చింది. రెండు సెకన్ల పాటు కంగారుపడ్డాను. ఏదేమైనా.. ఈ హాలిడే కోసం కేవలం రెండు జతల డ్రెస్‌లు మాత్రమే సర్దుకుంటున్నానంటూ సమంత క్యాప్షన్‌ ఇచ్చారు.

వివరాలు

ఈ క్షణాల కోసం ఎంతోకాలం ఎదురుచూశా

ప్రస్తుతం ఆమె షేర్‌ చేసిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత మాతృత్వం గురించి కూడా మాట్లాడారు.

తాను ఈ క్షణాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూశానని తెలిపారు. 'అమ్మా అనే పిలుపు కోసం ఎంతో పరితపించాను.

ఈ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ప్రతి రోజూ కొత్తగా అనిపిస్తోందని సమంత పేర్కొన్నారు.

ప్రస్తుతం సమంత కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్నారు. మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

ADVERTISEMENT