Page Loader
ఆక్వామ్యాన్ 2 ట్రైలర్: అదిరిపోయే విజువల్స్ తో ఆకట్టుకుంటున్న హాలీవుడ్ మూవీ 
ఆక్వామ్యాన్ అండ్ ది లాస్ట్ కింగ్ డమ్ ట్రైలర్ విడుదల

ఆక్వామ్యాన్ 2 ట్రైలర్: అదిరిపోయే విజువల్స్ తో ఆకట్టుకుంటున్న హాలీవుడ్ మూవీ 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 15, 2023
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

హాలీవుడ్ లో వచ్చే ఫ్రాంఛైజీ సినిమాల మీద ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఆక్వామ్యాన్ 2 వచ్చేస్తోంది. ఆక్వామ్యాన్ సినిమాకు సీక్వెల్ గా ఆక్వామ్యాన్ అండ్ ద లాస్ట్ కింగ్ డమ్ అనే టైటిల్ తో సినిమా వస్తోంది. వార్నర్ బ్రదర్స్, డీసీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. జేమ్స్ వాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ప్రధాన పాత్రలో జాసన్ మోమో నటిస్తున్నారు. పాట్రిక్ విల్సన్, రాండాల్ పార్క్, డాల్ఫ్ లండ్ గ్రెన్, నికోల్ కిడ్ మాన్ నటిస్తున్న ఈ సినిమా ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆక్వామ్యాన్ 2 ట్రైలర్