LOADING...
Arjun Rampal: విజయ్ మాల్యా పాత్రలో అర్జున్ రామ్‌పాల్..? 'బిలియనీర్' వెబ్ సిరీస్‌పై క్లారిటీ!
విజయ్ మాల్యా పాత్రలో అర్జున్ రామ్‌పాల్..? 'బిలియనీర్' వెబ్ సిరీస్‌పై క్లారిటీ!

Arjun Rampal: విజయ్ మాల్యా పాత్రలో అర్జున్ రామ్‌పాల్..? 'బిలియనీర్' వెబ్ సిరీస్‌పై క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2026
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన దేశంలోని బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మల్యా(Vijay Mallya) జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతున్న 'బిలియనీర్' (Billionaire) వెబ్ సిరీస్‌పై తాజాగా కీలక స్పష్టత వచ్చింది. కొంతకాలంగా ఈ సిరీస్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) విజయ్ మాల్యా పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ సిరీస్ నిర్మాత ప్రభ్‌లీన్ సంధు స్పందించారు. 'బిలియనీర్' వెబ్ సిరీస్‌లో నేరుగా విజయ్ మాల్యా పాత్ర ఉండదని, అయితే ఆయన జీవితంలోని కొన్ని అంశాల నుంచి స్ఫూర్తి పొందిన ఒక పాత్రను మాత్రం రూపొందించినట్లు ఆమె వెల్లడించారు.

వివరాలు

కల్పిత పాత్ర చుట్టూ కథ

ఆ కల్పిత పాత్రలో అర్జున్ రామ్‌పాల్ నటించనున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల 'దురంధర్' చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అర్జున్ రామ్‌పాల్‌తో కలిసి పనిచేయడానికి తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రభ్‌లీన్ సంధు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్‌కు ప్రముఖ దర్శకులు హన్సల్ మెహతా, రాబీ గ్రెవాల్ దర్శకత్వం వహించనున్నారు. దీంతో 'బిలియనీర్' సిరీస్ విజయ్ మాల్యా జీవితాన్ని పూర్తిగా ప్రతిబింబించే బయోపిక్ కాదని, ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలు, లక్షణాల ఆధారంగా రూపొందించిన కల్పిత పాత్ర చుట్టూ కథ నడవనున్నట్లు స్పష్టమైంది.

Advertisement