Loading...
Ananthan Kaadu: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. సైకో పోలీస్‌గా అదరగొట్టిన సునీల్!
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. సైకో పోలీస్‌గా అదరగొట్టిన సునీల్!

Ananthan Kaadu: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. సైకో పోలీస్‌గా అదరగొట్టిన సునీల్!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2026
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ చిత్ర పరిశ్రమలో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్య.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రమే 'అనంతన్ కాడు'. తమిళం, మలయాళ భాషల్లో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు జీఎన్ కృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. గోకులం గోపాలన్ నిర్మించారు. జూన్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ఈ నెల 2వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మరో నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది.

వివరాలు 

సునీల్ పాత్రే ప్రత్యేక ఆకర్షణ..

ఆర్యతో పాటు మురళీ గోపి, దేవ్ మోహన్, ఇంద్రన్స్, రెజీనా, నిఖిల విమల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

సునీల్ కూడా ఇందులో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఆయన.. సైకో స్వభావం ఉన్న పోలీస్ పాత్రలో మెప్పించినట్లు టాక్ వచ్చింది.

ఇప్పటివరకు సునీల్ చేసిన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో పోలిస్తే.. 'అనంతన్ కాడు'లో ఆయన పాత్ర మరింత భిన్నంగా, మరో స్థాయిలో ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా సైకో పోలీస్‌గా సునీల్ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

వివరాలు 

1990ల నాటి తిరువనంతపురం నేపథ్యంలో..

'అనంతన్ కాడు' కథ 1990ల కాలం నాటి తిరువనంతపురం నేపథ్యంలో సాగుతుంది.

అప్పట్లో అక్కడి రాజకీయ పరిణామాలు, రౌడీయిజం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతుంటారు.

అయితే ఈ గొడవలతో తనకు సంబంధం లేదని భావించే ఓ యువకుడు వాటికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంటాడు.

కానీ అనుకోని పరిస్థితుల్లో అతడే ఆ గొడవల్లోకి చిక్కుకుంటాడు.

అక్కడి నుంచి అతడి జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు, ఎదురయ్యే మలుపులే ఈ సినిమా కథను ముందుకు నడిపిస్తాయి.

ప్రస్తుతం 'అనంతన్ కాడు' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాను తెలుగు ఆడియోలో చూడాలనుకునే వారికి 'లైన్స్ గేట్ ప్లే'లో మాత్రమే ఆ అవకాశం అందుబాటులో ఉంది.

ADVERTISEMENT