
Raja Saab: ఈ ఏడాది 'రాజా సాబ్' లేనట్లే.. అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ తన అభిమానులతో ఒక స్పెషల్ ప్రామిస్ చేశాడు. ప్రతేడాది కనీసం రెండు సినిమాలైనా థియేటర్లలోకి తీసుకురావాలని, ఆ మాటకు కట్టుబడి వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.
గతేడాది 'కల్కి' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన డార్లింగ్ చేతిలో ఇప్పుడు అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి.
వీటిలో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజాసాబ్' ముందుగా విడుదల కావాల్సిన సినిమా.
ఈ ప్రాజెక్ట్‌ను తొలుత ఎలాంటి హడావిడి లేకుండా ప్రారంభించి, తర్వాత పోస్టర్లు, మోషన్ పోస్టర్‌లతో బజ్‌ను క్రమంగా పెంచారు.
మొదట్లో మారుతితో సినిమా వద్దంటూ స్పందించిన అభిమానులే, ఇప్పుడు రాజాసాబ్ కావాలంటూ ఎదురుచూడటాన్ని చూస్తే, క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
ఇలాంటి హైప్ మధ్య రాజాసాబ్ విడుదలైతే మాస్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
Details
సినిమాపై బజ్ తగ్గే అవకాశం
మేకర్స్ కూడా ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ప్రస్తుతం ఈ సినిమాపై ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో సందిగ్ధత నెలకొంది. షూటింగ్ ఎంత వరకు పూర్తి అయింది? ప్రస్తుతం ఏ స్టేజ్‌లో ఉంది? అనే వివరాలు ఎక్కడా వెల్లడించడంలేదు.
ఈ పరిస్థితిలో బజ్ తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. వాయిదా పడే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నా, కొత్త విడుదల తేదీ మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.
దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Details
ఈ ఏడాది విడుదల కావడం కష్టమే
ఇక తాజాగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, 'రాజాసాబ్'కు ఇంకా కొన్ని పాటల చిత్రీకరణ మిగిలి ఉందట. అ
వి పూర్తవ్వడానికి ఇంకా చాలా సమయం పడే అవకాశం ఉందని, అందువల్ల ఈ ఏడాదిలో సినిమా రావడం కష్టమేనని, 2026కి రిలీజ్ వాయిదా పడినా ఆశ్చర్యం లేదని టాక్ వినిపిస్తోంది.