ఓటీటీ: అసలు మూవీ రివ్యూ: రవిబాబు మార్క్ పనిచేసిందా?
ఈటీవీ విన్ ఓటీటీ ఛానెల్ లో అసలు మూవీ ఈరోజు విడుదలైంది. ఈ చిత్రానికి కథ అందించి తనే ప్రొడ్యూసర్ గా మారాడు రవిబాబు. దర్శకత్వ బాధ్యతలను మాత్రం ఉదయ్, సురేష్ ల మీద పెట్టాడు. రవిబాబు, పూర్ణ, సత్యక్రిష్ణన్, సూర్య ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ: పాథాలజీ ప్రొఫెసర్ గా పనిచేసే వెంకటేష్ చక్రవర్తి (సూర్య) దగ్గర జూనియర్ గా పనిచేస్తుంటుంది వందన (పూర్ణ). అయితే సడెన్ గా ఒకరోజు వెంకటేష్ చక్రవర్తిని ఎవరో హత్య చేస్తారు. అది కూడా ఆన్ లైన్ క్లాస్ క్లాస్ జరుగుతుండగా హత్య జరుగుతుంది. ఈ హత్య కేసును ఛేధించడానికి సీఐడీ ఆఫీసర్ (రంజిత్ రావు) రంగంలోకి దిగుతారు.
అసలు మూవీలో ఎవరెలా చేసారు?
ప్రొఫెసర్ ను హత్య చేసిన వాళ్ళను రంజిత్ రావు పట్టుకున్నారా లేదా అనేదే కథ. ప్లస్ పాయింట్స్: సినిమా మొదలైన కొద్దిసేపటికే కథలో థ్రిల్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఫస్టాఫ్ మంచి ఆసక్తికరంగా సాగుతుంది. హంతకుడు ఎవరన్నది తెలుసుకునే క్రమంలో వచ్చే సీన్లు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: ఫస్తాఫ్ లో కనిపించినంత వేగం సెకండాఫ్ లో కనిపించదు. అదీగాక హంతకుడిని మరీ తెలివైన వాడిలా చూపించాలని ప్రయత్నం చేసారు. కానీ అది సరిగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. కొన్ని సీన్లు వేరే వేరే సినిమాల్లో చూసినట్లుగా అనిపిస్తుంటాయి. రవిబాబు, పూర్ణ ల పాత్రలు బాగున్నాయి. థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడేవారు హ్యాపీగా చూసేయొచ్చు.