
హీరోయిన్ పూర్ణతో లవ్ ఎఫైర్ ఉందన్న దర్శకుడు రవిబాబు
ఈ వార్తాకథనం ఏంటి
సీనియర్ యాక్టర్ కీ.శే చలపతి రావు కొడుకు రవిబాబు, తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.
సినిమా ఇండస్ట్రీలో రవిబాబుకు నటుడిగా కంటే దర్శకుడిగా మంచి పేరుంది. విలక్షణమైన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా రవిబాబు గుర్తుండిపోతారు.
అమ్మాయిలు, అబ్బాయిలు, అల్లరి, అవును, అనసూయ వంటి చిత్రాలను రవిబాబు ప్రేక్షకులకు పరిచయం చేసాడు. తాజాగా హీరోయిన్ పూర్ణ గురించి రవిబాబు కీలక కామెంట్లు చేసారు.
రవిబాబు దర్శకత్వంలోంచి వచ్చిన చాలా సినిమాల్లో పూర్ణ హీరోయిన్ గా కనిపించింది. ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయిన అసలు చిత్రంలోనూ పూర్ణ కనిపించింది.
అయితే తన సినిమాల్లో హీరోయిన్ పూర్ణ ఎందుకు ఎక్కువగా కనిపిస్తుందని, అసలు ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో మీడియా బృందం ప్రశ్న వేసింది.
Details
లవ్ ఎఫైరే కానీ అందరూ అనుకునేలా కాదు
పూర్ణతో ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేసిన రవిబాబు, మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, పూర్ణతో తనకు లవ్ ఎఫైర్ ఉందని అన్నాడు.
కాకపోతే జనాలు అందరూ అనుకునే ఎఫైర్ కాదనీ, సాధారణంగా దర్శకులు చెప్పిన దానికంటే నటులు ఇంకొంచెం ఎక్కువ చేసి ఇంప్రూవ్ చేస్తారనీ, అలా 200శాతం ఇంప్రూవ్ చేయడంలో పూర్ణ ముందుంటుందనీ అన్నాడు.
అందుకే తను ఏదైనా సినిమా అనుకున్నప్పుడు అందులో హీరోయిన్ పాత్రలో పూర్ణ గుర్తొస్తుందనీ, కొన్ని కొన్ని సార్లు ఆమె తన సినిమాలను రిజెక్ట్ చేస్తుందనీ, వాషింగ్ మెషిన్ అనే సినిమాను రెజెక్ట్ చేసిందని అన్నాడు రవిబాబు.
ప్రస్తుతం రవిబాబు నుండి వచ్చిన అసలు మూవీ, ఈటీవీ విన్ లో ఈరోజు నుండి అందుబాటులో ఉంటుంది.