Page Loader
Ashok Galla: మహేష్ మేనల్లుడి మరో సినిమా.. పోస్టర్‌ను ఆవిష్కరించిన మహేష్ బాబు 
మహేష్ మేనల్లుడి మరో సినిమా.. పోస్టర్‌ను ఆవిష్కరించిన మహేష్ బాబు

Ashok Galla: మహేష్ మేనల్లుడి మరో సినిమా.. పోస్టర్‌ను ఆవిష్కరించిన మహేష్ బాబు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 05, 2024
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇటీవల టిల్లు స్క్వేర్‌తో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా అశోక్ గల్లా తన తదుపరి చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో చేతులు కలిపారు. సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.27 గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ రోజు (ఏప్రిల్ 5)అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పోస్టర్‌ ను చూస్తే.. ఈ చిత్రం అమెరికా నేపథ్యంలో జరుగుతుందని అర్థమవుతోంది. 'ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ'తో కూడిన పోస్టర్ డిజైన్ ఆకట్టుకుంటోంది. "హ్యాపీ బర్త్‌డే అశోక్" అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసింది చిత్ర బృందం.

Details 

ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ 

ప్రేమ, హాస్యం మేళవింపుతో ఈ తరం మెచ్చే అందమైన కథతో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రంతో ఉద్భవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.MAD, లవర్‌ లో హీరోయిన్ గా నటించిన శ్రీ గౌరీ ప్రియ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. త్వరలో ఇతర విషయాలు వెల్లడిస్తామని చెప్పారు నిర్మాతలు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చేసిన ట్వీట్