LOADING...
Priyanka Jain : దాడులు చేయడం దుర్మార్గం.. పల్లవి ప్రశాంత్ ఇష్యూపై స్పందించిన ప్రియాంక
దాడులు చేయడం దుర్మార్గం.. పల్లవి ప్రశాంత్ ఇష్యూపై స్పందించిన ప్రియాంక

Priyanka Jain : దాడులు చేయడం దుర్మార్గం.. పల్లవి ప్రశాంత్ ఇష్యూపై స్పందించిన ప్రియాంక

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2023
06:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిగ్ బాస్ 7 లో టైటిల్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్, రన్నరప్‌గా అమర్‌దీప్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్ నుంచి బయటికొస్తున్న సమయంలో అమర్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ చేశారు. అలాగే అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై శివాజీ, శోభ, భోలే స్పందించారు. తాజాగా ప్రియాంక జైన్(Priyanka Jain) నోరు విప్పారు. అభిమానం పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేయడం చాలా దారుణమని, ఫ్యాన్స్ పేరుతో ఇలా గొడవలు చేయడం కరెక్ట్ కాదని ప్రియాంక చెప్పుకొచ్చారు. ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించవచ్చని, అయితే ఇలా దాడి చేయడం దుర్మార్గమని పేర్కొంది.

Details

ప్రశాంత్ తో మంచి బాండింగ్ ఏర్పడింది : ప్రియాంక

హౌస్‌లో గేమ్ పరంగా మాత్రమే తమకు గొడవలున్నాయని, టాస్క్ ముగియగానే పల్లవి ప్రశాంత్, యావర్, శివాజీ, అమర్ ఇలా అందరం కలిసి ఉండేవాళ్లమని తెలిపింది. అమర్ కారుపై దాడి జరిగిన సమయంలో కారులో తనతో పాటు తల్లి, భార్య కూడా ఉన్నారనే విషయాన్ని మర్చిపోతే ఎలా అని ప్రియాంక ప్రశ్నించింది. చివరి నాలుగు వారాల్లో పల్లవి ప్రశాంత్‌తో తమకు మంచి బాండింగ్ ఏర్పడిందన్నారు.