Page Loader
Barabar Premistha : చంద్రహాస్ సెకండ్ సినిమా 'బరాబర్ ప్రేమిస్తా' టీజర్ రిలీజ్ 

Barabar Premistha : చంద్రహాస్ సెకండ్ సినిమా 'బరాబర్ ప్రేమిస్తా' టీజర్ రిలీజ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2024
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీనియర్ నటుడు ఈటీవీ ప్రభాకర్ తనయుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఇటీవల రామ్ నగర్ బన్నీ అనే సినిమాతో హీరోగా పరిచయమై, ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా, తన పేరు బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఆయన రెండో సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో చంద్రహాస్, మేఘన ముఖర్జీ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా దర్శకత్వం సంపత్ రుద్ర చేస్తున్నారు. గెడ చందు, గాయత్రీ చిన్ని, AVR నిర్మాణంలో తెరకెక్కుతుంది.

వివరాలు 

టీజర్‌ను విడుదల చేసిన సీనియర్ దర్శకుడు 

తాజాగా, ఈ రోజు 'బరాబర్ ప్రేమిస్తా' సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ను సీనియర్ దర్శకుడు వివి వినాయక్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే , ఈ సినిమా రుద్రారం అనే ఊళ్ళో జరిగే కథ, అక్కడ ప్రతి విషయానికీ ప్రతిదానికి కొట్టుకుంటారని తెలుస్తోంది. ఆ మధ్యలో హీరో-హీరోయిన్ల ప్రేమకథ ఉంటుందని, ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనింగ్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకోసం సిద్ధంగా ఉంది.