Page Loader
వైరల్ వీడియో: ఇండోర్ క్రికెట్ మైదానంలో తగ్గేదేలే అంటూ కనిపించిన ఆస్ట్రేలియా కుర్రాడు
అల్లు అర్జున్ డైలాగ్ తో అదరగొట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ అభిమాని

వైరల్ వీడియో: ఇండోర్ క్రికెట్ మైదానంలో తగ్గేదేలే అంటూ కనిపించిన ఆస్ట్రేలియా కుర్రాడు

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 04, 2023
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. పుష్ప లోని తగ్గేదేలే డైలాగ్ ప్రపంచ మంతా పాకిపోయింది. బాలీవుడ్ సెలెబ్రిటీల నుండి మొదలుపెడితే అంతర్జాతీయ క్రికెటర్ల వరకూ తగ్గేదేలే మ్యానరిజాన్ని చూపించారు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్, ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో, తగ్గేదేలే అంటూ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో, తగ్గేదేలే అనే మ్యానరిజంతో కనిపించాడు ఆస్ట్రేలియా అభిమాని. దీంతో అల్లు అర్జున్ మూవీ పుష్ప ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో చాలా ఉందని అర్థమవుతోంది. పుష్పతోనే ఇలా ఉంటే పుష్ప2 మూవీతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండోర్ క్రికెట్ మైదానంలో తగ్గేదేలే అంటూ కనిపించిన ఆస్ట్రేలియా కుర్రాడు