అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది
ఈ వార్తాకథనం ఏంటి
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అవును, ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది.
భూషణ్ కుమార్ నిర్మాతగా టీ సిరీస్ బ్యానర్ లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రకటనతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందంలో ఉన్నారు.
పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ గా మారిన అల్లు అర్జున్, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్న సందీప్ వంగాతో కలుస్తుండడంతో మరో మంచి సినిమా వస్తుందని వాళ్ళు భావిస్తున్నారు.
దాంతో అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. సినిమా ఎప్పుడు మొదలవుతుందని ఇప్పటి నుండే ఆశగా ఉన్నారు.
అల్లు అర్జున్
పుష్ప తర్వాత మొదలవుతుందా?
నిజానికి అల్లు అర్జున్ తో అర్జున్ రెడ్డి సినిమాను చేయాల్సింది సందీప్ వంగా. అప్పట్లో కథ కూడా చెప్పాడు. కానీ అల్లు అర్జున్ అప్పుడు కాదన్నాడు, ఇప్పుడు మాత్రం సెట్టయిపోయింది.
ఇప్పటికీ చాలామంది అభిమానుల్లో, అర్జున్ రెడ్డి సినిమా అల్లు అర్జున్ చేసుంటే ఎలా ఉండేదోనన్న ఊహ ఉంది. ఆ ఊహలు ఇప్పుడు నిజం కాకపోయినా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ దర్శకత్వంలో మాత్రం సినిమా మొదలవుతోంది.
ఐతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా తెలియదు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేతిలో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఉంది. మరి అదయ్యాక సందీప్ తో సినిమా ఉంటుందా? లేదా సందీప్ తోనే ముందుగా ఉంటుందా అనేది తెలియాలి.