Page Loader
అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల
సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల

అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 27, 2023
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈమధ్య హీరోల పుట్టినరోజు సంధర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలు విడుదల చేయడం ట్రెండ్ గా మారింది. అలాగే ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. అందుకే పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన అల్లు అర్జున్ సూపర్ హిట్ చిత్రం దేశముదురు, మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ వర్గాలలో ఊహాగానాలు మొదలు అయ్యాయి. పుకార్లు నిజమైతే, సినిమా మార్చి 28, 2023న విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప: ది రూల్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మార్చిలో దేశముదురు రీ రిలీజ్ అయ్యే అవకాశం