Page Loader
అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ?
షారుక్ ఖాన్ తో అల్లు అర్జున్ మల్టీస్టారర్?

అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ?

వ్రాసిన వారు Sriram Pranateja
Feb 14, 2023
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ పుష్ప సినిమాతో అమాంతం పెరిగిపోయింది. ఒక్క తెలుగులోనే కాదు మొత్తం ఇండియాలోనే పాపులర్ పర్సన్ అయ్యారు అల్లు అర్జున్. అందుకే ఇప్పుడు పుష్ప 2 కోసం ఎక్కువగా కష్టపడుతున్నారు. ఆల్రెడీ పుష్ప 2 షూటింగ్ మొదలైంది. కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. పుష్ప మూవీకి బాలీవుడ్ లో దక్కిన విజయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు అల్లు అర్జున్ కు బాలీవుడ్ అవకాశాలను తెచ్చిపెడుతోంది. తాజాగా షారుక్ ఖాన్ తో అల్లు అర్జున్ మల్టీస్టారర్ ఉండే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తోంది.

అల్లు అర్జున్

అల్లు అర్జున్ వైపే అట్లీ మొగ్గు

తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ జవాన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం ఇతర బాషల హీరోలను తీసుకోవాలని చూస్తున్నారట. అందులో భాగంగా అల్లు అర్జున్ ని అడిగారని, కథ కూడా చెప్పారని తెలుస్తోంది. కాకపోతే అల్లు అర్జున్ నుండి ఎలాంటి స్పందన రాలేదని చెప్పుకుంటున్నారు. యెస్ ఆర్ నో రెండూ చెప్పకుండా వెయిటింగ్ లో ఉంచినట్లు సమాచారం. మరి అట్లీ ఆఫర్ ని అల్లు అర్జున్ ఒప్పుకుని బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాడా లేదా చూడాలి. జవాన్ మూవీలో షారుక్ ఖాన్ సరసన నయన తార హీరోయిన్ గా కనిపిస్తుంది. ఈ సంవత్సరం జూన్ 3వ తేదీన విడుదల కానుంది.