LOADING...
Avatar 3: Fire and Ash : 'అవతార్ 3' రన్‌టైమ్ లాక్‌.. అభిమానుల్లో భారీ హైప్!
'అవతార్ 3' రన్‌టైమ్ లాక్‌.. అభిమానుల్లో భారీ హైప్!

Avatar 3: Fire and Ash : 'అవతార్ 3' రన్‌టైమ్ లాక్‌.. అభిమానుల్లో భారీ హైప్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2025
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్ని రకాల సినిమాలు వచ్చినా, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రాలు చాలా అరుదు. అలాంటి అనుభూతిని అందించిన సిరీస్‌లో 'అవతార్' ఫ్రాంచైజీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. హాలీవుడ్ విజనరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ సిరీస్‌ భాషా బేధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసింది. ఇప్పటికే రెండు భాగాలు ప్రేక్షకులను విభిన్నమైన పండోరా లోకానికి పరిచయం చేయగా, మూడో భాగం 'అవతార్: ఫైర్ అండ్ అష్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Details

మొత్తం 3 గంటల 15 నిమిషాలు 

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మొత్తం 3 గంటల 15 నిమిషాల (195 నిమిషాల) నిడివితో ఫైనల్‌గా లాక్ అయినట్టు తెలుస్తోంది. తొలి భాగం 'అవతార్' (2009) 2 గంటలు 58 నిమిషాలు, రెండో భాగం 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' 3 గంటలు 12 నిమిషాల నిడివితో భారీ విజువల్ అనుభూతిని అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడో భాగం ఈ రెండు సినిమాలకన్నా మరింత ఎక్కువ నిడివితో రాబోతుండడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Details

డిసెంబర్ 19న రిలీజ్

2025 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'అవతార్ 3'లో పండోరా ప్రపంచానికి కొత్త విలన్ 'వరాంగ్'ను పరిచయం చేయబోతున్నారు. ఈ పాత్రలో నటి 'ఊనా చాప్లిన్' నటించనుండటం చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఐవా (Eywa)కి వ్యతిరేకంగా నిలబడే తొలి నావి పాత్రగా వరాంగ్ కనిపించనుండటం వల్ల కథలో భారీ ట్విస్ట్ ఉండబోతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. జేమ్స్ కామెరూన్ ఇప్పటికే 'అవతార్ 3' పూర్వ భాగాల కంటే మరింత ఉద్వేగభరితంగా, భావోద్వేగంగా, ఉత్కంఠగా ఉంటుందని వెల్లడించారు. సామ్ వర్తింగ్టన్, జోయ్ సల్డానా, సిగోర్నీ వీవర్, కేట్ విన్‌స్లెట్ వంటి ప్రధాన పాత్రధారులు తమ పాత్రలను కొనసాగించగా, ఊనా చాప్లిన్ కొత్తగా జట్టు లో చేరుతున్నారు.

Details

ఐదు భాగాలుగా చిత్రీకరణ

ఈ ఫ్రాంచైజీని మొత్తం ఐదు భాగాలుగా రూపొందించే ఆలోచనలో ఉన్న కామెరూన్.. మూడో భాగం తరువాత నాలుగోది 2029లో, ఐదోది 2031లో విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇదిలా ఉండగా 'అవతార్ 3' విడుదల సమయంలోనే మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే' ట్రైలర్‌ను థియేటర్లలో అటాచ్ చేయనున్నారన్న వార్తలు హాలీవుడ్ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమైతే అవతార్ అభిమానులతో పాటు మార్వెల్ ప్రేక్షకులకు కూడా ఇది రెండు రెట్లు ఆనందాన్ని అందించే 'డబుల్ ట్రీట్' అవుతుంది.