
Avika Gor Wedding: పెళ్లి పీటలు ఎక్కిన అవికా గోర్.. వరుడు ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
'చిన్నారి పెళ్లికూతురు'గా గుర్తింపు పొందిన నటి అవికా గోర్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 30న ఆమె తన ప్రియుడు మిళింద్ చద్వానీతో వివాహమాడారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ అవికా ఇటీవల తన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'బాలిక నుంచి వధువు వరకూ..' అనే క్యాప్షన్‌తో కొన్ని ప్రత్యేక పిక్స్ అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారి, అభిమానులు మరియు సెలబ్రిటీలు జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అవికాను వివాహం చేసుకున్న మిళింద్ చద్వానీ సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త. 'క్యాంప్ డైరీస్' అనే ఎన్జీవోను స్థాపించారు.
Details
పెద్ద అంగీకారంతో పెళ్లి
అంతకుముందు ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. 2019లో ప్రసారమైన 'రోడీస్ రియల్ హీరోస్' షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అవికా-మిళింద్ పరిచయం కొన్నాళ్ల క్రితం కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఏర్పడింది. తర్వాత స్నేహితులుగా మారి, పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడిగారు. అవికా గోర్ 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి, తర్వాత 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజుగారి గది 3' వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. ఆమె తాజా సినిమా 'షణ్ముఖ' ఈ ఏడాది మార్చిలో విడుదలైంది.