LOADING...
Kollywood : కోలీవుడ్ లో విషాదం.. AVM స్టూడియోస్ సంస్థ అధినేత AVM శరవణన్ కన్నుమూత 
కోలీవుడ్ లో విషాదం.. AVM స్టూడియోస్ సంస్థ అధినేత AVM శరవణన్ కన్నుమూత

Kollywood : కోలీవుడ్ లో విషాదం.. AVM స్టూడియోస్ సంస్థ అధినేత AVM శరవణన్ కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ సంస్థ ఏవీఎం స్టూడియోస్ పేరు వినగానే తెలుగు-తమిళ ప్రేక్షకులకు ప్రత్యేక గౌరవం గుర్తుకొస్తుంది. అదే బ్యానర్‌పై ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు రూపొందాయి. అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ అధినేతల్లో ఒకరైన ప్రముఖ సినీ నిర్మాత ఎం. శరవణన్ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో వయోభారం కారణంగా చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు ఒక యుగాంతంలా భావిస్తున్నారు.

వివరాలు 

ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 300 సినిమాలు 

నిన్నే తన పుట్టినరోజును జరుపుకున్న శరవణన్ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాదాపు 300 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగులో "లీడర్" సినిమాతో రానా దగ్గుబాటిను హీరోగా పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది. శరవణన్ భౌతికకాయాన్ని ఈ మధ్యాహ్నం 3:30 గంటల వరకు చెన్నైలోని ఏవీఎం స్టూడియోస్ మూడవ అంతస్తులో ప్రజల సందర్శనార్ధం ఉంచనున్నారు. తమిళ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే దార్శనిక నిర్మాత, గురువు, మార్గదర్శకుడిని కోల్పోయిన కోలీవుడ్ మొత్తం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తోంది.

Advertisement