Page Loader
Baahubali: రెండేళ్ల షూటింగ్‌ చేసిన 'బాహుబలి' ప్రీక్వెల్‌... విడుదలకు ముందు నిలిపివేత!
రెండేళ్ల షూటింగ్‌ చేసిన 'బాహుబలి' ప్రీక్వెల్‌... విడుదలకు ముందు నిలిపివేత!

Baahubali: రెండేళ్ల షూటింగ్‌ చేసిన 'బాహుబలి' ప్రీక్వెల్‌... విడుదలకు ముందు నిలిపివేత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2024
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'.. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ విజయం తరువాత నెట్‌ఫ్లిక్స్‌ 'బాహుబలి' కథకు ప్రీక్వెల్‌గా 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్‌' అనే వెబ్‌సిరీస్‌ను ప్రకటించింది. కానీ ఈ ప్రాజెక్ట్‌ ఎక్కడా నిలదొక్కుకోలేదని తాజాగా బాలీవుడ్‌ నటుడు బిజయ్‌ ఆనంద్‌ చెప్పారు. మొదట ఈ ప్రాజెక్ట్‌ని సాధారణ షోగా భావించానని, ఆఫర్‌ వచ్చినప్పుడు సరైన ఆసక్తి చూపలేదన్నారు. కానీ చివరికి ఒప్పుకున్నానని, దాదాపు రెండేళ్లపాటు హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొన్నానని వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్‌ చివరికి ఈ ప్రాజెక్ట్‌ నిలిపేయడమే ఉత్తమమని భావించిందని ఆనంద్‌ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.80 కోట్లు ఖర్చుపెట్టారన్నారు.

Details

నవలల ఆధారంగా ప్రాజెక్టు 

ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన ఆనంద్‌కు, అదే సమయంలో ప్రభాస్‌ హీరోగా నటించిన 'సాహో'లో అవకాశం వచ్చినప్పటికీ, డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో దాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. రచయిత ఆనంద్‌ నీలకంఠన్‌ రచించిన 'ది రైజ్ ఆఫ్ శివగామి', 'క్వీన్ ఆఫ్ మాహిష్మతి' నవలలను ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. మొదట ప్రధాన పాత్రకు మృణాల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేసినా, తర్వాత ఆ పాత్ర వామికా గబ్బికి దక్కింది. బాహుబలి: ది బిగినింగ్‌', 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇది ప్రేక్షకుల్లో నిరాశను కలిగించగా, ఫ్యాన్స్‌ ఇంకా ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు.