LOADING...
Baahubali Collections: బాహుబలి ది ఎపిక్: రీ రిలీజ్ కలెక్షన్స్ తో నేషనల్ రికార్డ్
బాహుబలి ది ఎపిక్: రీ రిలీజ్ కలెక్షన్స్ తో నేషనల్ రికార్డ్

Baahubali Collections: బాహుబలి ది ఎపిక్: రీ రిలీజ్ కలెక్షన్స్ తో నేషనల్ రికార్డ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచి సరికొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా రెండూ ఘన విజయం సాధించడంతో పాటు కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవల ఈ రెండు భాగాలను సమ్మిళితంగా ఒకే సినిమాగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 31న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలైంది. రీ-రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ చాలా బలంగా వచ్చాయి. మళ్లీ మొదటిసారి రిలీజ్ అయ్యినట్టు థియేటర్లలో బాహుబలి హంగామా కనిపించింది. బుకింగ్స్ కూడా భారీగా అయ్యాయి.

వివరాలు 

రాజమౌళి బ్రాండ్ వల్లే భారీ హైప్

ప్రచారం లేకుండానే దర్శకుడు రాజమౌళి బ్రాండ్ వల్లే భారీ హైప్ ఏర్పడింది. అయితే ఇది ప్రధానంగా తెలుగు వర్షన్‌కు మాత్రమే వర్తించింది; ఇతర భాషల్లో మాత్రం అంతగా స్పందన రాలేదు. అడ్వాన్స్ టికెట్లు, ఆన్‌లైన్ రిజర్వేషన్లను చూసి ఈసారి రీ-రిలీజ్ ద్వారా దాదాపు 100 కోట్ల గ్రాస్ వస్తుందని అంచనాలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకూ వచ్చిన వసూళ్లు చూస్తే 'బాహుబలి: ది ఎపిక్' సుమారుగా 45 కోట్ల గ్రాస్ సాధించింది. అంచనాలకు తగ్గ వసూళ్లు రాలేనప్పటికీ, రీ-రిలీజ్ అయిన చిత్రాలలో ఇదే ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా కొత్త రికార్డు నెలకొల్పింది.

వివరాలు 

ఈ కేటగిరీలో ఇంతకు ముందు.. 

సనం తేరీ కసం - 42 కోట్లు తుంబాడ్ - 38 కోట్లు ఘిల్లి - 32 కోట్లు ఏ జవానీ హై దివానీ - 26 కోట్లు ఇవే రీ-రిస్ట్ వసూళ్లలో టాప్‌లో నిలిచాయి. ఇప్పుడు వీటన్నింటినీ దాటి బాహుబలి 45 కోట్లతో మొదటి స్థానానికి చేరుకుంది. ఇంకా థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగుతున్నందున మొత్తం కలెక్షన్స్ 50 కోట్ల వరకు చేరే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రమోషన్స్‌ను అన్ని భాషల్లో సక్రమంగా నిర్వహించి ఉంటే, ఈ సినిమా రీ-రిస్ట్ వసూళ్లు మరింత ఎక్కువయ్యేవని ప్రభాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, రీ-రిస్ట్‌ల్లో దేశవ్యాప్తంగా టాప్ స్థానం దక్కించుకోవడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.