
Babita Phogat: 'దంగల్' సినిమాపై బబితా ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ రెజ్లర్ బబితా ఫొగాట్ ఇటీవల 'దంగల్' మూవీ టీమ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తమ కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు.
బబితా తెలిపిన వివరాల ప్రకారం, చండీగఢ్‌కు చెందిన ఒక విలేఖరి తమ కుటుంబంపై ఒక కథ రాశారని, ఆ కథనం చదివి దర్శకుడు నితేశ్ తివారీ తాను డాక్యుమెంటరీ చేయాలనుకుంటున్నానని మొదట చెప్పారని చెప్పారు.
కానీ, ఆ తర్వాత నితేశ్ స్క్రిప్ట్ సిద్ధం చేసి తమపై సినిమా చేయాలని ముందుకొచ్చారన్నారు. నితేశ్ తివారీ సినిమాను ఎలా చేయాలనుకుంటున్నాడో వివరించినప్పుడు, తాము చాలా భావోద్వేగానికి లోనయ్యామని పేర్కొన్నారు.
Details
ఆమిర్‌ఖాన్ టీమ్‌ను సంప్రదించినా పట్టించుకోలేదు
తమ పేర్లు మాత్రం తప్పనిసరిగా వాడాలని తన తండ్రి పట్టుబట్టాడని చెప్పింది. సినిమా విడుదల అయిన తర్వాత, వారి కుటుంబం మొత్తం 'దంగల్'ను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని తెలిపారు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్లకు పైగా వసూలు చేసిందని, కానీ తమకు మాత్రం కేవలం కోటి రూపాయలు మాత్రమే అందాయని బబితా వెల్లడించారు.
అంతటి భారీ విజయాన్ని అందించినప్పటికీ, తమ గ్రామంలో అకాడమీ కోసం ఆమీర్ ఖాన్ టీమ్‌ను సంప్రదించినా వారు సహకరించలేదన్నారు.
అకాడమీ నిర్మాణం కోసం రూ.5 కోట్ల వరకు అవసరం ఉందని ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు.
Details
సాక్షి నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది
ఇటీవల మహిళా రెజ్లర్లు జాతీయ రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.
దీనిపై సాక్షి మాలిక్ చేసిన ఆరోపణలు, బబితా ఫొగాట్ తమ నిరసనలో భాగమని పేర్కొన్న విషయం వివాదాస్పదమైంది.
సాక్షి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ప్రియాంక గాంధీ పంపిన ఆహారం కోసం ఆ నిరసన వేదిక వద్ద ఎవరు ఉన్నారో సాక్షి స్పష్టత ఇవ్వాలని ఆమె వివరించారు.