తదుపరి వార్తా కథనం

Jivi Babu: బలగం నటుడు కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 25, 2025
10:25 am
ఈ వార్తాకథనం ఏంటి
రంగస్థల నటుడు, 'బలగం' మూవీ ద్వారా గుర్తింపు పొందిన జీవి బాబు కన్నుమూశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, వరంగల్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతి పట్ల 'బలగం' దర్శకుడు వేణు సంతాపం తెలిపారు.
జీవి బాబు నాటక రంగంలో తన జీవితమంతా గడిపారని, బలగం ద్వారా పరిచయం చేయడం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు.
సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 'బలగం'లో ఆయన అంజన్న పాత్రలో నటించారు.