Akhanda 2 : 'అఖండ 2'.. రిలీజ్ టీజర్ విడుదల .. బాలయ్య బాబు ఉగ్రరూపం..
ఈ వార్తాకథనం ఏంటి
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో భారీ ప్రాజెక్ట్ 'అఖండ 2' సినిమాపై ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. గ్లింప్స్,టీజర్,ట్రైలర్ వంటి ప్రమోషనల్ వీడియోలు వరుసగా విడుదలై హైప్‌ను పెంచాయి. ఇక నేడు జరిగే ప్రీరిలీజ్ఈవెంట్ సందర్భంగా, సినిమా విడుదలకు ముందు ప్రత్యేకంగా'అఖండ 2 మాస్ తాండవం టీజర్' పేరుతో ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈచిత్రం డిసెంబర్ 5న పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ చేసిన మాస్ తాండవం టీజర్ చూస్తే ట్రైలర్, టీజర్స్ మించి ఉంది. ఇందులో మాస్ ఎలిమెంట్స్‌ను పుష్కలంగా చూపించారు. ఇందులో బాలయ్య బాబు ఉగ్రరూపంతో దర్శనమివ్వబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మీరుకూడా 'అఖండ 2' మాస్ తాండవం టీజర్‌ను తప్పక చూడండి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'అఖండ 2'.. రిలీజ్ టీజర్
Akhanda 2 MASSIVE Thaandavam TEASER... 🔥🔥 #Akhanda2 #Akhanda2Thandavam pic.twitter.com/m8hlHHCWyN
— Narendra Chowdary Raavi (@NarendraRavi7) November 28, 2025