Page Loader
Daaku Maharaaj: OTTలోకి 'డాకు మహారాజ్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..? 
Daaku Maharaaj: OTTలోకి 'డాకు మహారాజ్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

Daaku Maharaaj: OTTలోకి 'డాకు మహారాజ్'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాలయ్య మార్క్ యాక్షన్, బాబీ డైరెక్షన్, తమన్ బీజీఎమ్ కలిసి "డాకు మహారాజ్" సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ వరుసగా నాలుగు వంద కోట్లు అందుకుని, సీనియర్ హీరోగా కొత్త రికార్డు సృష్టించారు. ఇటీవల అనంతపురంలో ఈ సినిమా విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో మంచి కలెక్షన్లతో రన్ అవుతుండగా, మరోవైపు ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

వివరాలు 

 ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీలోకి 

"డాకు మహారాజ్" సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రానుందని ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 9 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.