Daaku Maharaaj: బాలకృష్ణ 'డాకు మహారాజ్' ఫస్ట్ సింగిల్.. లాంచ్ టైమ్ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'డాకు మహారాజ్' సినిమా, ఎన్‌బీకే 109గా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూఎస్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ టెక్సాస్‌లోని డల్లాస్‌లో, 2025 జనవరి 4న Texas Trust CU Theatreలో సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. బాలకృష్ణ అభిమానుల కోసం ఈ వేడుకను ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
రేపు ఉదయం 10:08 గంటలకు రిలీజ్
ఈ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్ ప్రోమోను రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ హై ఎనర్జిటిక్ FIERCE Track అభిమానుల అంచనాలను పెంచుతోంది. తాజాగా విడుదల చేసిన బాలకృష్ణ ఫైటింగ్ లుక్ ఈ సాంగ్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన మహిళా పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనుండగా, ప్రగ్యా జైశ్వాల్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను అలరించేందుకు ఈ భారీ బడ్జెట్ చిత్రం సిద్ధమవుతోంది.