
Bhagavath Kesari: బాలయ్య 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్‍ను ప్రకటించిన చిత్రబృందం
ఈ వార్తాకథనం ఏంటి
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో భగవంత్ కేసరి (Bhagavath Kesari) అనే టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.
ఇది వరకు 'భగవంత్ కేసరి' సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్, పోస్టర్లు రిలీజ్ చేసారు. దసరా సందర్భంగా సినిమా రిలీజ్ ఉంటుందని గతంలో చెప్పారు. కానీ ఏ తేదీన విడుదలవుతుందో అప్పుడు చెప్పలేదు.
తాజాగా విడుదల తేదీని ఖరారు చేస్తూ పోస్టర్ వదిలారు. అక్టోబర్ 19వ తేదీన భగవంత్ కేసరి సినిమా, థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
షైన్ స్క్రీన్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భగవంత్ కేసరి రిలీజ్ డేట్ పై ట్వీట్
#Bhagavanthkesari Grand Worldwide Release on October 19th,2023💥#BhagavanthKesariOnOCT19
— Anil Ravipudi (@AnilRavipudi) July 22, 2023
Natasimham #NandamuriBalakrishna garu @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @RamprasadDop #Rajeevan #TammiRaju @Shine_Screens… pic.twitter.com/zSPPz9vbXZ