LOADING...
Aditya 369 movie: 'ఆదిత్య 369'లో శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ ఎంపిక వెనుక కథ
'ఆదిత్య 369'లో శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ ఎంపిక వెనుక కథ

Aditya 369 movie: 'ఆదిత్య 369'లో శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ ఎంపిక వెనుక కథ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణంలోనే కాకుండా, మొత్తం తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో 'ఆదిత్య 369' ఒకటిగా నిలుస్తుంది. కొత్తదనాన్ని ప్రాధాన్యంగా తీసుకునే దర్శకుడిగా గుర్తింపు పొందిన సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో రూపొందిన తొలి తెలుగు చిత్రంగా దీనిని చెప్పుకోవచ్చు. టైమ్ మెషిన్ అనే విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు అప్పటివరకు చూడని కొత్త అనుభూతిని అందించింది.

వివరాలు 

కృష్ణకుమార్ పాత్రకు కమల్ హాసన్

ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో మెప్పించారు.కృష్ణకుమార్ పాత్రలోనూ, శ్రీకృష్ణదేవరాయలుగా కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ప్రారంభంలో కృష్ణకుమార్ పాత్రకు బాలకృష్ణ కాకుండా కమల్ హాసన్‌ను తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన దర్శక-నిర్మాతల వద్ద చర్చకు వచ్చిందట. శ్రీకృష్ణదేవరాయల పాత్రకు మాత్రం బాలకృష్ణ మాత్రమే సరైన ఎంపిక అని భావించి,ఆ పాత్రకు ఆయన్ను ఖరారు చేశారు. కృష్ణకుమార్ పాత్రకు కమల్ హాసన్ సరిపోతారని భావించి, ఇద్దరితో కలిసి మల్టీస్టారర్‌గా సినిమా తీయాలన్న యోచన కూడా జరిగింది. కానీ ఆ సమయంలో కమల్ హాసన్ ఇప్పటికే మరో రెండు సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొనలేకపోయారు. దీంతో చివరికి బాలకృష్ణే రెండు పాత్రలను తానే పోషిస్తూ'ఆదిత్య 369'ను గుర్తుండిపోయే సినిమాగా మలిచారు.

Advertisement