
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. భగవంత్ కేసరిలో మరో పాట
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా 'భగవంత్ కేసరి'లో ఓ పాటను అదనంగా జతచేయనున్నారు. ఈ మేరకు నందమూరి అభిమానుల్లో బాలయ్య కొత్త జోష్ నింపారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'భగవంత్ కేసరి' ప్రస్తుతం సినిమా టాకీసుల్లో సందడి చేస్తోంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తయారైన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా రూ.100 కోట్ల వసూలుకు రెడిగా ఉంది.
బాలయ్య మార్క్ యాక్షన్, సమాజంలోని సున్నితమైన సమస్యలను సందేశాత్మకంగా ఈ సినిమాలో చూపించారు.
విజ్జీ పాపగా యుంగ్ బ్యూటీ శ్రీలీల నటన అభినయం కనబరిచింది. మొదటి ఆట నుంచే కేసరి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
details
మళ్లీ భగవంత్ కేసరిలో 'దంచవే మేనత్త కూతురా' బీట్ సాంగ్
మరోవైపు ఈ సినిమాలో 'దంచవే మేనత్త కూతురా' బీట్ సాంగ్ ఉండటం అభిమానులకు దసరా తర్వాత మరో పండగ వచ్చినట్టైంది.
ఇదే సమయంలో సందేశాత్మకంగా ఉన్న సినిమాలో రెగ్యులర్ మాస్ సాంగ్స్ ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, సినిమా లయ పోతుందని చిత్ర యూనిట్ ఆ పాటను పక్కన పెట్టేశారు.
రిలీజ్ తర్వాత కొన్ని రోజులకే ఆ పాటను ఫ్యాన్స్ కోసం మళ్లీ జత చేస్తామని చేస్తామని ఇటీవలే డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
ఈసారి బాలయ్య మళ్లీ అదే విషయంపై స్పష్టతనిచ్చారు. తెలంగాణ నేపథ్యంలోనే సాగే ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రలతో మెప్పించారు.
ఈ సినిమాలో బాలయ్య జంటగా కాజల్ అగర్వాల్ నటించడం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కొత్త పాటపై బాలయ్య ప్రకటన
We will be adding the new song to the film very soon, and it has a duration of 4 minutes and 30 seconds.
— Gulte (@GulteOfficial) October 23, 2023
- #NandamuriBalaKrishna#BhagavanthKesari pic.twitter.com/UTNNHPEyBJ