Loading...
Balakrishna Dada Movie: దాదా కోసం బాలయ్య ఏం చేశాడో తెలుసా?
దాదా కోసం బాలయ్య ఏం చేశాడో తెలుసా?

Balakrishna Dada Movie: దాదా కోసం బాలయ్య ఏం చేశాడో తెలుసా?

వ్రాసిన వారు Balachander Sharma
Nov 11, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ అభిమానులకు 'దాదా' నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బాలయ్య మరోసారి గాయకుడిగా మారారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆయన స్వయంగా ఓ పాట పాడారు. 'దాదా ధమాకా' పేరుతో ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను దీపావళి సందర్భంగా మేకర్స్‌ విడుదల చేశారు. అయితే ఆ పాటను పాడింది బాలయ్యే అనే విషయాన్ని తాజాగా వెల్లడించారు. దీంతో పాట ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. పూర్తి పాటను నవంబర్‌ 13న విడుదల చేయనున్నారు.

Details

'మామా ఏక్‌ పెగ్‌ లా' గుర్తొస్తుందా?

బాలయ్య చివరిసారిగా 2017లో వచ్చిన 'పైసా వసూల్‌' సినిమా కోసం తన గొంతు వినిపించారు.

అందులోని 'మామా ఏక్‌ పెగ్‌ లా' పాట అప్పట్లో థియేటర్లతో పాటు పార్టీలు, ఫంక్షన్లలోనూ భారీగా వినిపించింది.

బాలయ్య స్వరంలోని ప్రత్యేకమైన ఎనర్జీ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఇప్పుడు 'దాదా ధమాకా'తో మరోసారి అదే జోష్‌ను తెరపైకి తీసుకురాబోతున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Details

భారీ అంచనాలతో 'దాదా'

'వీరసింహారెడ్డి' తర్వాత బాలయ్య, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'దాదా'పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.

ఇందులో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

తమన్‌ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు.

ADVERTISEMENT

Details

క్రిస్మస్‌కు బాలయ్య మాస్‌ ట్రీట్

'దాదా ధమాకా' పాట నవంబర్‌ 13న బయటకు వచ్చిన తర్వాత బాలయ్య అభిమానుల్లో సందడి మరింత పెరిగే అవకాశం ఉంది.

సినిమా మాత్రం డిసెంబర్‌ 24న క్రిస్మస్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈసారి బాలయ్య నటనతో పాటు ఆయన గొంతు కూడా 'దాదా'పై అంచనాలను మరింత పెంచుతోంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బాలయ్య నోట దాదా ధమాకా సాంగ్

ADVERTISEMENT