Balakrishna: కొరటాల శివ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్.. భారీ యాక్షన్‌కు రంగం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ యాక్షన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి యాక్షన్ మోడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటీవల 'దాదాస' సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో వైద్యుల సూచన మేరకు కొంతకాలం షూటింగ్‌కు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడి వేగంగా కోలుకుంటున్నారని సమాచారం. అక్టోబర్ నుంచి బాలకృష్ణ తిరిగి సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 'వీరసింహారెడ్డి' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి బాలయ్య చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిందని తెలుస్తోంది.
వివరాలు
అక్టోబర్‌లో తదుపరి షెడ్యూల్
అక్టోబర్‌లో ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్‌లో బాలకృష్ణ పాల్గొని,మిగిలిన చిత్రీకరణతో పాటు కీలకమైన భారీ యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేయనున్నారని సమాచారం.
ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బాలకృష్ణ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీ కానున్నారు.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించనున్న సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుందని టాక్.
షూటింగ్ మొదటి దశలో బాలకృష్ణకు సంబంధించిన సన్నివేశాలను కాకుండా ఇతర సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.
ఆ తర్వాత బాలయ్య సెట్స్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌తో ఆయన పార్ట్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు కొరటాల శివ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
వివరాలు
హైదరాబాద్‌లో భారీ సెట్
బాలకృష్ణ కోసం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఓ ప్రత్యేకమైన సెట్‌ను నిర్మిస్తున్నారట.
ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బాలయ్యను చూడని విధంగా సరికొత్త లుక్‌లో చూపించడంతో పాటు, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు పూర్తిగా సరిపోయేలా ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను కొరటాల శివ డిజైన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఈ సినిమా విషయంలో తాజాగా బయటకు వచ్చిన ఓ వార్త ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.
అదే బాలకృష్ణ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నారనే సమాచారం.