
Venkatesh: వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? 'తన వల్ల నాకు వేరే బెస్ట్ ఫ్రెండ్స్ అవసరం రాలేదు': వెంకటేష్
ఈ వార్తాకథనం ఏంటి
హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం" సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.
చిత్రయూనిట్ ఇప్పటికే సినిమా ప్రమోషన్లు ప్రారంభించి, రెండు సూపర్ హిట్ సాంగ్స్ విడుదల చేసినది. ఇప్పుడు మూడో పాట విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ ప్రమోషన్లలో భాగంగా వెంకటేశ్ ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.
ఈ టాక్ షోను నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, సురేష్ బాబు, వెంకటేశ్ కలిసి సందడి చేశారు.
వివరాలు
రానా చాలా సైలెంట్
ఈ సందర్భంగా, వెంకటేశ్ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన భార్య నీరజ గురించి కూడా ఆయన మాట్లాడారు.
బాలకృష్ణ ఈ షోలో "మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?" అని అడిగినప్పుడు,వెంకటేశ్ "నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్య నీరజ"అని సమాధానం ఇచ్చారు.
"ఆమెతో నేను సమయం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఏ సమయంలోనైనా ఆమెతో కాలం గడపడానికి ఆసక్తి ఉంటుంది. ఇద్దరం కలిసి టూర్స్ కూడా వెళ్లిపోతాం. ఆమెతో వంట కూడా చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది" అని చెప్పారు.
అలాగే, చిన్నప్పుడు రానా చాలా సైలెంట్‌గా ఉండేవాడని వెంకటేశ్ చెప్పారు."రానా నా బెడ్ కింద సూపర్ హీరోల బొమ్మలతో ఆడుతూ ఉండేవాడని" అన్నారు.
వివరాలు
క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ..
తనకు క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ చాలా ఇష్టమని వెంకటేశ్ అన్నారు.
2011లో ధోనీ నాయకత్వంలో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, సచిన్, ధోనీని కలిసిన అనుభవం గురించి ఆయన మాట్లాడుతూ, "ధోనీని డ్రెస్సింగ్ రూమ్‌లో అభినందించడానికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన పని నాకు షాకింగ్ అనిపించింది" అని అన్నారు.
ఈ సంగతులు తెలియాలంటే, డిసెంబర్ 27న ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ షో ఏడవ ఎపిసోడ్ చూడాల్సి ఉంటుంది.