అమెరికాలో వీరసింహారెడ్డి వీరంగం.. వీరయ్యను దాటి
ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద మహా సంబరంగా ఉండనుంది. తెలుగు సినిమా పెద్ద హీరోలు తమ సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా జనవరి13వ తేదీన థియేటర్లలోకి వస్తుంది. అంతకంటే ఒకరోజు ముందే వీరసింహారెడ్డితో దిగుతున్నాడు బాలయ్య. ప్రస్తుతం ఈ రెండు సినిమాల మధ్య మంచి పోటీ నెలకొంది. వీటిల్లో ఏ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల ప్రమోషన్లు మొదలయ్యాయి. పాటలను విడుదల చేసి మోత మోగించారు. రెండు సినిమాల పాటలకు ప్రేక్షకుల నుండి స్పందన ఒకే విధంగా కనిపిస్తోంది. దాంతో పోటీ మరింత గట్టిగా తయారైంది. ప్రస్తుతం అమెరికాలో ఆల్రెడీ ఈ సినిమాల టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి.
వాల్తేరును దాటి పైపైకి వీరసింహారెడ్డి
అమెరికాలో బాలయ్య వీరసింహారెడ్డి సినిమాకు ఎక్కువ టికెట్లు అమ్ముడైనట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, వీరసింహారెడ్డి సినిమాకు 69లోకేషన్లలో3300 టికెట్లు అమ్ముడై, 60వేల డాలర్లు వసూలు అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే, 62లోకేషన్లలో 2200టికెట్లు అమ్ముడై 40వేల డాలర్లు వసూలు అయ్యాయి. దీంతో బాలయ్య ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మరి వీరసింహారెడ్డి హవా ఇలాగే ఎప్పటి వరకు కొనసాగుతుందో చూడాలి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. ఇటు వాల్తేరు వీరయ్య సినిమాను కే బాబీ రూపొందించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు.