NBK: మరోసారి గోపిచంద్‌తో బాలయ్య
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది.
ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ రేంజ్‌లో తెరకెక్కించి, బాలయ్యను అదిరిపోయే మాస్ అవతార్‌లో చూపించాడు.
పవర్‌ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా, నందమూరి అభిమానులకు మాసివ్ ట్రీట్ ఇచ్చింది.
బాలయ్య - గోపీచంద్ మళ్లీ కలయిక!
వీరసింహారెడ్డి సూపర్ హిట్ తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరోసారి సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
ఇటీవల డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న బాలయ్య, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నాడు.
ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు బాలయ్య.
వివరాలు
అఖండ 2 - అఘోరా సన్నివేశాల చిత్రీకరణ
అఘోరాకి సంబందించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అఖండ 2 షూటింగ్ పూర్తయ్యాక, బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాను ప్రారంభించనున్నాడు.
పాన్ ఇండియా రేంజ్‌లో బాలయ్య - గోపీచంద్ మాస్ మూవీ
గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలీవుడ్‌లో 'జాట్' అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూర్తయ్యాక, బాలయ్య సినిమా కథపై పనిచేయనున్నాడు. అయితే, ఈసారి గోపీచంద్ & బాలయ్య కాంబో పాన్ ఇండియా లెవెల్‌లో మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నారు.
వివరాలు
డాకు మహారాజ్ నుంచి బాలయ్య వరుసగా పాన్ ఇండియా సినిమాలే!
ఇప్పటికే అఖండ 2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఇప్పుడు గోపీచంద్ సినిమా కూడా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా ఓటిటీలో విడుదలై, పాన్ ఇండియా స్థాయిలో భారీ రెస్పాన్స్ అందుకుంది.
గోపీచంద్ సినిమా తర్వాత, బాలయ్య డాకు మహారాజ్ దర్శకుడు బాబీతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఏదేమైనా, ప్రస్తుతం బాలయ్య క్రేజ్ నెక్ట్స్ లెవెల్‌లో కొనసాగుతోందని చెప్పడంలో సందేహమే లేదు!
ఈ విజయం తర్వాత బాలయ్య చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉండబోతుంది అని చెప్పొచ్చు.