LOADING...
NBK 111: మరో సెన్సేషనల్ మూవీకి సిద్దమైన బాలయ్య - గోపీచంద్ మలినేని.. రెడీ ఫర్ యాక్షన్ 
మరో సెన్సేషనల్ మూవీకి సిద్దమైన బాలయ్య - గోపీచంద్ మలినేని.. రెడీ ఫర్ యాక్షన్

NBK 111: మరో సెన్సేషనల్ మూవీకి సిద్దమైన బాలయ్య - గోపీచంద్ మలినేని.. రెడీ ఫర్ యాక్షన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

'వీరసింహా రెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని, మరోసారి నటసింహ నందమూరి బాలకృష్ణతో చేతులు కలపనున్న విషయం తెలిసిందే. రాయలసీమ నేపథ్యంతో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ఆయన,ఈసారి పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఇప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పవర్ఫుల్ కాంబోను అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలారు నిర్మించనున్నారు. NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్నఈ చిత్రం నవంబర్ 7న పూజా కార్యక్రమాలతో సెట్స్‌పైకి వెళ్లనుంది. యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో పాటు,ఈ సినిమా రెండు వేర్వేరు కాలాల నేపథ్యంలో సాగే హిస్టారికల్ - ప్రెజెంట్ మిక్స్‌డ్ ఎపిక్ స్టోరీగా ఉండబోతుందని సమాచారం.

వివరాలు 

బాలయ్య కెరీర్‌లోనే మోస్ట్ పవర్ఫుల్,బెస్ట్ ప్రాజెక్ట్ 

టైమ్ ట్రావెల్ తరహా కథాంశం కలిగిన ఈ చిత్రం బాలయ్యను ఇంతవరకు ఎప్పుడూ చూడని రూపంలో చూపించబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ షూట్‌ను మొరాకోలో పూర్తి చేసినట్టు తెలిసింది. టెక్నికల్ టీమ్ విషయంలో కూడా మేకర్స్ ఎక్కడా రాజీ పడటం లేదు. ఈ చిత్రానికి 'కాంతార' సినిమాకు సినిమాటోగ్రఫీ చేసిన అర్వింద్ కశ్యప్ను డీవోపీగా తీసుకున్నారు. సంగీత బాధ్యతలు బాలయ్యకు ఇష్టమైన కంపోజర్ తమన్కు అప్పగించారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం,ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే మోస్ట్ పవర్ఫుల్,బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. ఇక మరో కొన్ని రోజుల్లోనే బాలయ్య-గోపీచంద్ కాంబో నుంచి యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టార్ట్ కానుంది.