Loading...
Dada: బాలయ్య వచ్చేస్తున్నారు.. 'దాదా' మైసూర్‌ షెడ్యూల్‌లో నటసింహం ఎంట్రీ
బాలయ్య వచ్చేస్తున్నారు.. 'దాదా' మైసూర్‌ షెడ్యూల్‌లో నటసింహం ఎంట్రీ

Dada: బాలయ్య వచ్చేస్తున్నారు.. 'దాదా' మైసూర్‌ షెడ్యూల్‌లో నటసింహం ఎంట్రీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2026
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ చిత్రం 'దాదా'. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్‌ విజయం తర్వాత ఈ మాస్‌ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ట్రేడ్‌ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా.. విలన్‌గా మంచు మనోజ్‌ సరికొత్త పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. అయితే గత నెలలో 'దాదా' షూటింగ్‌ కాకినాడ పోర్టు పరిసరాల్లో జరుగుతున్న సమయంలో బాలకృష్ణ గాయపడ్డారు. దీంతో వైద్యులు ఆయన మోకాలికి శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం కొద్ది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్న బాలయ్య.. ప్రస్తుతం కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.

వివరాలు

ముఖ్యమైన షెడ్యూల్ మైసూర్ లో

ఈ సినిమా మైసూర్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ను సెప్టెంబర్‌ 29 నుంచి ప్రారంభించారు. ముందుగా ఇతర కీలక నటీనటులతో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇక అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ ఈరోజు నుంచి మైసూర్‌ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు.

ఈ షెడ్యూల్‌లో బాలయ్యపై కొన్ని భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు కీలకమైన డ్రామా సీన్లను తెరకెక్కించేందుకు దర్శకుడు గోపీచంద్‌ మలినేని ప్లాన్‌ చేస్తున్నారు.

వివరాలు

డిసెంబర్ 24న రిలీజ్

సినిమా చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయడంతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా వేగవంతం చేయాలని మేకర్స్‌ ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఈ క్రేజీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు.

నందమూరి తమన్‌గా పేరు తెచ్చుకున్న తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ADVERTISEMENT