LOADING...
 NBK 111 : బాలయ్య-నయనతార కాంబో కన్‌ఫర్మ్‌.. మరో బ్లాక్‌బస్టర్ గ్యారంటీ! 
బాలయ్య-నయనతార కాంబో కన్‌ఫర్మ్‌.. మరో బ్లాక్‌బస్టర్ గ్యారంటీ!

 NBK 111 : బాలయ్య-నయనతార కాంబో కన్‌ఫర్మ్‌.. మరో బ్లాక్‌బస్టర్ గ్యారంటీ! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

'వీరసింహారెడ్డి'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలిపాడు. గత సినిమాలో బాలకృష్ణ లుక్‌, గెటప్‌, మాస్‌ యాక్షన్‌ సీన్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈసారి మరింత గ్రాండ్‌గా, పాన్‌ ఇండియా స్థాయిలో ఓ ఊర మాస్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుకు గోపీచంద్ మలినేని సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై సతీష్‌ కిలారు నిర్మించనున్నారు. అఖండ 2 తర్వాత ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారన్న చర్చకు ముగింపు లభించింది. ఈ పాత్రకు పలువురి పేర్లు పరిశీలించిన మేకర్స్‌ చివరకు స్టార్‌ హీరోయిన్‌ నయనతారను ఫైనల్‌ చేశారు.

Details

నవంబర్ 7న పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బాలయ్యతో ఇప్పటికే 'శ్రీరామరాజ్యం', 'జైసింహా' వంటి సూపర్‌ హిట్స్‌ ఇచ్చిన నయనతార, లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మళ్లీ బాలయ్యతో జోడీ కట్టబోతుంది. తాజాగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని నయనతారను కలసి కథ వినిపించగా, ఆమె వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసిందని సమాచారం. ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్‌ కూడా తీసుకోబోతున్నట్లు టాక్‌. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జోరుగా సాగుతున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 7న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. సంగీతం విషయానికి వస్తే, ఈ ప్రాజెక్ట్‌కు టాలీవుడ్‌ సెన్సేషన్‌ థమన్‌ సంగీతం అందించనున్నాడు. బాలయ్య-నయనతార జంటగా మూడోసారి రాబోతున్న ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'వీరసింహారెడ్డి' తర్వాత మరో హ్యాట్రిక్‌ హిట్‌ బాలయ్య ఖాతాలో పడుతుందేమో చూడాలి.