NBK 111: బాలయ్య కొత్త లుక్ రెడీ.. అండర్‌వర్‌ల్డ్ డాన్‌గా డబిడదిబిడే!
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'NBK 111' చిత్రానికి సంబంధించిన ఓ సాలిడ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. 'వీరసింహారెడ్డి' బ్లాక్‌బస్టర్ విజయానంతరం 'గాడ్ ఆఫ్ మాసెస్'గా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మార్చి 6 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుందని సమాచారం. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో చిత్రీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా అండర్‌వర్‌ల్డ్ డాన్ పాత్రలో కనిపించబోతున్నారట.
Details
పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం
ముంబై మాఫియా నేపథ్యంతో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం బాలయ్యపై ప్రత్యేక లుక్ టెస్ట్ నిర్వహించారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో బాలకృష్ణ భిన్నమైన గెటప్పులు ట్రై చేసినట్లు, సినిమా కోసం పూర్తిగా కొత్త మేకోవర్‌లో దర్శనమివ్వనున్నట్లు వినిపిస్తోంది. పాత్ర డిమాండ్ మేరకు కాస్త స్లిమ్‌గా మారాలని దర్శకుడు సూచించడంతో ప్రస్తుతం బాలయ్య తన శరీరాకృతిని మార్చుకునే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. డాన్ పాత్రకు తగ్గట్టుగా ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారట. 'NBK 111'లో అగ్ర కథానాయిక నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
Details
ఆ కథను పక్కనపెట్టినట్లు సమాచారం
నిజానికి ఈ ప్రాజెక్ట్‌కు ముందుగా అనుకున్న కథ వేరేనట. అయితే బడ్జెట్ పరిమితుల కారణంగా ఆ కథను పక్కన పెట్టినట్లు సమాచారం. ఆ వెర్షన్‌లోనూ నయనతారనే హీరోయిన్‌గా ఎంపిక చేసినప్పటికీ, కథ మారిన తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్‌లో ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. బాలయ్య-నయనతార కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో 'NBK 111'పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.