Loading...
NBK 111 : రిలీజ్‌కు ముందే బాలయ్య రికార్డు.. NBK111 ఓటీటీ హక్కులు భారీ ధరకు సేల్!
రిలీజ్‌కు ముందే బాలయ్య రికార్డు.. NBK111 ఓటీటీ హక్కులు భారీ ధరకు సేల్!

NBK 111 : రిలీజ్‌కు ముందే బాలయ్య రికార్డు.. NBK111 ఓటీటీ హక్కులు భారీ ధరకు సేల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2026
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'NBK111'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌కు అద్భుత స్పందన రావడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలకు ముందే బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా యంగ్ హీరో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. స్టార్ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలున్నాయి.

వివరాలు

భారీ మొత్తానికి సొంతం చేసుకున్న జీ5

తాజాగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఒప్పంద విలువ ఎంత అనేది అధికారికంగా వెల్లడించకపోయినా ఫ్యాన్సీ రేటుకే డీల్ కుదిరినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల జీ5 తమ ప్లాట్‌ఫారమ్‌లో త్వరలో విడుదల కానున్న క్రేజీ కంటెంట్ జాబితాను అధికారికంగా ప్రకటించింది.

ఆ జాబితాలో NBK111కు కూడా స్థానం కల్పించడం ద్వారా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తామే దక్కించుకున్నట్లు సంస్థ అధికారికంగా ధృవీకరించింది.

వివరాలు

భారీ ప్రభావం చూపే అవకాశం

ఈ ఒప్పందంతో బాలకృష్ణ సినిమా థియేటర్లలోనే కాకుండా డిజిటల్ వేదికలో కూడా భారీ ప్రభావం చూపనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఈ ఏడాది డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు సమాచారం.

సంగీత దర్శకుడు ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డిసెంబర్ బాక్సాఫీస్ రేసులో ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకంతో బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT